● దుల్హన్ పథకాన్ని రద్దు సరికాదు
●ఎన్నికల ప్రచారంలో బీసీలు వెన్నుముక అని అధికారం లోకి రాగానే వెన్నుముక విరిచిన జగన్
విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధికార ప్రతినిధి సయ్యద్ అబ్దుల్ నజీబ్ మాట్లాడుతూ జగన్ పాదయాత్ర చేసేటప్పుడు తలను నిమిరి, ముద్దులు పెట్టి నటులుని మించి నటన జగన్ చేశారని, ప్రభుత్వం దగ్గర నిధులు లేవని ముస్లీంలకు ఇచ్చిన దుల్హన్ పథకం హామీ నిలిపివేస్తామని కోర్టుకు సమాధానం ఇచ్చిన వైసీపీ ప్రభుత్వమని, వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు దుల్హన్ పథకం అమలు చేసిందో సమాధానం చెప్పాలని, ఇది మైనార్టీ ముస్లింలకు మోసం చేయడమేనని, ముస్లీం యువత స్థిరపడేందుకు స్వయం ఉపాధి 5లక్షలు ఇస్తాము అని చెప్పి మాట తప్పిన మాట వాస్తవం కాదా అని, దూదేకుల ఫెడరేషన్ కోసం గత ప్రభుత్వం రూ. 40కోట్లు ఖర్చు చేస్తే దాని ఊసే లేక గాలి కొదిలేసిన గాలి పార్టీ అని, ఇంకా తనకు 175కి 175 సీట్లు రావాలని తన అభ్యర్థులకు టార్గెట్ పెట్టారు కానీ, ప్రజలు 175కి 175 ఓడిద్దాం అని టార్గెట్ పెట్టుకున్నారని అన్నారు. అనంతరం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ మోబినా మాట్లాడుతూ మైనారిటీ మహిళలకు గత ప్రభుత్వంలో దుల్హన్ పథకం కింద రూ.50,000లు ఇచ్చేవారని, పాదయాత్రలో వైఎస్ జగన్ దుల్హన్ పథకం కింద లక్ష రూపాయలు ఇస్తానని మాట ఇచ్చి ఆ పథకాన్ని రద్దు చేసి మైనార్టీల ద్రోహి అని, హజ్ యాత్రకి ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఒక్కరికైనా ఇచ్చిన దాఖలాలు లేవని, ముత్తవల్లికి 5,000 చొప్పున ఇచ్చి ఇల్లు కట్టి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి దాన్ని తుంగలో తొక్కారని, ముస్లిం మైనారిటీ లు ఎవరైనా చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, కాబోయే రోజుల్లో ముస్లిం మైనారిటీలు జగన్ కి తగిన గుణపాఠం చెప్తారని, కుల, మతాలకు అతీతంగా ముస్లిం మైనారిటీలకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అండగా ఉన్నారని, ముస్లిం మైనారిటీ పిల్లలను దత్తత తీసుకొని ఆదరిస్తున్నారని, రాబోయే రోజుల్లో ముస్లిం మైనారిటీ లు పెద్ద ఎత్తున జనసేన కు మద్దతుగా నిలుస్తారని తెలిపారు. జనసేన పార్టీ యువ నాయకులు ఎం.హనుమాన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా బీసీలకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, బీసీ అక్కాచెల్లెళ్లకు పెళ్లి కానుక కింద 50 వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇవ్వలేదని, ఎన్నికల ప్రచారంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా యువతకు ఇవ్వలేదని, యువతకు తీరని అన్యాయం జగన్ చేశారని, రాబోయే రోజుల్లో యువత తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జనసేనపార్టీ యువ నాయకులు మారుపిళ్ళా చిన్నారావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో బీసీలు వెన్నుముక అని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే బీసీల వెన్నుముక విరిచరాని, జగన్ బీసీ బస్సు యాత్ర చేయడానికి అర్హులు కాదని, 56 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ప్రచారం చేసుకునే జగన్ ఒక్కరి కూడా పది రూపాయలు ఇవ్వలేదని, బీసీ కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టించిన ఘనత జగన్ దేనని, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని, బీసీలకు స్వయం ఉపాధితో సొంత కాళ్లపై నిలబెట్టే బీసీ సబ్ ప్లాన్ తుంగలో తొక్కారని, జనసేన పార్టీ బీసీలకు అండగా నిలబడిందని, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన మహేష్ తోనే బీసీల విజయడంకా మోగిస్తామని తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com