Logo
Date of Publish : 12 December 2022, 12:59 pm
Editor : Sake Naresh

మంత్రి రోజమ్మా !  పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి నీది కాదు ! పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్ మాకినీడి శేషు కుమారి

      పిఠాపురం, (జనస్వరం) : జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంఛార్జ్ మాకినీడి శేషు కుమారి తనదైన శైలిలో మాట్లాడుతూ "మా అధినాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయానిదా?" అని మంత్రి రోజమ్మ పై నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచార రథాన్ని సిద్ధం చేసుకుని "వారాహి" అనే నామకరణం చేస్తే, నీకు ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వానికి ఎందుకు కడుపు మంట! ఓడినా గెలిచినా సింహం సింగిల్ గానే నిలబడింది చూడు! నిరంతరం ప్రజల పక్షాన నిలబడి, మీ ప్రభుత్వ తప్పుడు విధానాలపై పోరాడుతూ, ఈ రాష్ట్ర ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తూ ప్రజల్లో తనకంటూ ఒక గొప్ప స్థానంలో ఉన్న మా జనసేనానిని చూసి ఎందుకు మీరు భయపడుతున్నారని! మండిపడ్డారు. ప్యాకేజీ స్టార్ అని, వీకెండ్ స్టార్ అని, రకరకాలుగా మీరెన్ని తప్పుడు విధాలుగా మాట్లాడినా మీ రాజకీయ భవిష్యత్తును ప్రజలు ఏ విధంగా శాసిస్తారో రేపు జరగబోయే ఎన్నికల సంగ్రామంలో మీ అహంకారానికి ఈ రాష్ట్ర ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్పే రోజు ఒకటి వస్తుందని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత గతంలో ఎన్నో పార్టీలకు ప్రజలు అధికారం ఇస్తే, అహంకారంతో విర్రవీగి కాలగర్భంలో చాలా పార్టీలు కలిసిపోయాయని, ఇక మీరెంత? అని తనదైన శైలిలో మంత్రి రోజను హెచ్చరిస్తూ పిఠాపురం నియోజకవర్గం ఇంఛార్జ్ ఫైర్ బ్రాండ్ మాకినీడి శేషు కుమారి గట్టిగా వార్నింగ్ ఇస్తూ, నీవు రాజకీయాలను వదిలి మరల జబర్దస్త్ కే, పరిమితమయ్యే రోజు ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకోమని హితువు పలికారు. గతంలో నీవు తెలుగుదేశం పార్టీలో ఉండి, నన్ను ఆ పార్టీ నాయకులు పొడిచిచారని, నా వెనుక ఉంటూ నన్ను తెలుగుదేశం నాయకులు వోడగోట్టారని, జగనన్న దగ్గరికి వెళ్లి గగ్గోలు పెట్టి ఏడిస్తే, పార్టీలో నీకు సీటు ఇచ్చాడని, నీవు గెలిచి మంత్రివై ఇప్పుడు విర్రవీగుతున్నావని, ఏదో తండ్రి సానుభూతిని అడ్డం పెట్టుకుని, ప్రజలను మాయ చేసి, మోసం చేసి నీ జగనన్న గద్దినెక్కాడని గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్ర ప్రజలు, దేవుడు దయదలచి నీ జగనన్నకు అదృష్టం కలిసి వస్తే, అధికారమధoతో మీరంతా మంత్రులుగా ఉండి విర్రవీగడo ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మంత్రి రోజమ్మా! ఆనాడు దుష్ట సంహరణ చేసిన ఆ వారాహి అమ్మవారే, నిజాయితీగల మా మా నాయకుడు జనసేనానిని రేపు విజయం వైపు నడిపిస్తారని, గెలిపిస్తారని ఆ నమ్మకం మాకు పూర్తి విశ్వాసంతో ఉన్నదని, ఈ రాష్ట్ర ప్రజలలో జనసేనానిపై అంచెలంచల ప్రేమాభిమానం ఉప్పెనెలా పెరుగుతూ ఉన్నదని, ఈ సందర్భంగా నీకు ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను. గుర్తుపెట్టుకో! అని మాకినీడి శేషు కుమారి మీడియాకు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com