Logo
Date of Publish : 07 January 2023, 3:03 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ ని, మెగా కుటుంబ సభ్యులను విమర్శించే స్థాయి మంత్రి రోజాది కాదు : జనసేన వీర మహిళ శశిరేఖ

• ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన కుటుంబం మెగా కుటుంబం

      వార్తలు, (జనస్వరం) :  ఆంధ్రప్రదేశ్ లో రైతాంగాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసినా, కౌలు రైతు కుటుంబాల పక్షాన తన సొంత నిధులతో కౌలు రైతు కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేయాల్సినటువంటి పనిని కూడా కళ్యాణ్ చేస్తా ఉంటే చూసి ఓర్వలేక పవన్ కళ్యాణ్ వారి కుటుంబం పై మంత్రి రోజా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని నట్టేట ముంచుతా ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఆశా కిరణుల కనిపిస్తున్నటువంటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని తెలిపారు. రాబోవు ఎన్నికలలో జనసేన ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం వారి కుటుంబం పై పర్యాటక శాఖ మంత్రి రోజా చేత బురద జల్లుతున్నారని మండిపడ్డారు. పిల్లికి కూడా బిక్షం వేయలేనటువంటి వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి, కరోణ కష్టకాలంలో ప్రజలను గాలికి వదిలేసిన వ్యక్తి జగన్ రెడ్డి, నిరుద్యోగులను గాలికి వదిలేసినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి, ఉద్యోగస్తులకు కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి వ్యక్తి జగన్ రెడ్డి నీ, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న ఆపలేని దద్దమ్మ జగన్ రెడ్డి ని జనసేన మహిళా నాయకురాలు శశిరేఖ ఖండించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని మీరు చేసే అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, వైసిపి నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని జనసేన మహిళా నాయకురాలు శశిరేఖ తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ప్రతిపక్ష నాయకుల పై విమర్శలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని లేనిపక్షంలో మిమ్మల్ని రోడ్లపై కూడా తిరగకుండా చేస్తామని జనసేన మహిళ నాయకురాలు శశిరేఖ తెలియజేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com