• ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన కుటుంబం మెగా కుటుంబం
వార్తలు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ లో రైతాంగాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసినా, కౌలు రైతు కుటుంబాల పక్షాన తన సొంత నిధులతో కౌలు రైతు కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేయాల్సినటువంటి పనిని కూడా కళ్యాణ్ చేస్తా ఉంటే చూసి ఓర్వలేక పవన్ కళ్యాణ్ వారి కుటుంబం పై మంత్రి రోజా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని నట్టేట ముంచుతా ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఆశా కిరణుల కనిపిస్తున్నటువంటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని తెలిపారు. రాబోవు ఎన్నికలలో జనసేన ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం వారి కుటుంబం పై పర్యాటక శాఖ మంత్రి రోజా చేత బురద జల్లుతున్నారని మండిపడ్డారు. పిల్లికి కూడా బిక్షం వేయలేనటువంటి వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి, కరోణ కష్టకాలంలో ప్రజలను గాలికి వదిలేసిన వ్యక్తి జగన్ రెడ్డి, నిరుద్యోగులను గాలికి వదిలేసినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి, ఉద్యోగస్తులకు కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి వ్యక్తి జగన్ రెడ్డి నీ, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న ఆపలేని దద్దమ్మ జగన్ రెడ్డి ని జనసేన మహిళా నాయకురాలు శశిరేఖ ఖండించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని మీరు చేసే అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, వైసిపి నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని జనసేన మహిళా నాయకురాలు శశిరేఖ తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ప్రతిపక్ష నాయకుల పై విమర్శలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని లేనిపక్షంలో మిమ్మల్ని రోడ్లపై కూడా తిరగకుండా చేస్తామని జనసేన మహిళ నాయకురాలు శశిరేఖ తెలియజేయడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com