సర్వేపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలో కొనసాగుతున్న జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర ఐదవ రోజైన ఆదివారం వెంకటాచలం మండలంలోని ప్రసిద్ధిగాంచిన గొలగమూడి క్షేత్రం నుంచి బయలుదేరి కాకుటూరు పరిశ్రమల కేంద్రం వద్ద ఉన్న అడివిలోని శివాలయం, ఆ తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ స్వామి దర్గాకు చేరుకుంది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ హిజ్రాల మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఐదేళ్లు ప్రతిపక్షంలో, మరో ఐదేళ్లు అధికార పక్షంలో ప్రజల సొమ్ము, ఖనిజ సంపదను దోచుకుని దాచుకుంది చాలు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి కాకానిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. మంత్రి కాకాని లక్ష్యం ఒకటే సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కాదు. ప్రతిపక్షాలపై బురద జల్లడం, దుష్ప్రచారం చేయడం, అసభ్యకర రీతిలో తిట్టడం తప్ప. పేద ప్రజలకు చేసిందేమి లేదు. కాకాని దోచుకున్న వేల కోట్ల రూపాయల సొమ్మును టీడీపీ, జనసేన పార్టీలు కలిసి స్థాపించే ప్రజా ప్రభుత్వంలో తిరిగి కక్కిస్తాం. బడుగు బలహీన వర్గాల పై కాకాని చేయించిన దాడులు, దౌర్జన్యాలు, ఆ కారణంగా నష్టపోయిన వారి పాపాలను కాకాని నువ్వు మూటకట్టుకున్నావు. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రజా ప్రభుత్వంలో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి చేస్తాయి. ఈ కార్యక్రమంలో వీర మహిళ గుమినేని వాణి భవాని, వెంకటాచలం మండలం కార్యదర్శి శ్రీహరి, చెంచయ్య కార్యదర్శి కాకి శివ, రవి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం మస్తాన్ గిరీష్ పసుపులేటి మురళి వంశి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com