Logo
Date of Publish : 26 October 2021, 4:33 pm
Editor : Sake Naresh

స్థానిక సమస్యలపై దృష్టి పెట్టకుండా మంత్రి కొడాలినాని ప్రతిపక్షాలును విమర్శించటం పైనే దృష్టి పెట్టారు : జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్

   గుడివాడ, (జనస్వరం) : గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో నియోజకవర్గ ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ  గుడివాడ నియోజకవర్గంలో స్థానిక సమస్యలపై దృష్టి పెట్టకుండా మంత్రి కొడాలినాని ప్రతిపక్షాలును విమర్శించటం పైనే దృష్టి పెట్టారు అని విమర్శించారు. గుడివాడ ప్రధాన రహదారి గవర్నమెంట్ హాస్పిటల్ కి అనేక రోగులు, గర్భిణులు ప్రయాణించే రహదారి గుంతలుమయంగా ఉందని అనేక సార్లు ప్రభుత్వానికి తెలియజేసాము. Oct2 వ తేదీన మా శక్తి కొలది బాగు చేసాము. మళ్ళీ అది యదాస్థితికి వచ్చింది. R&B అధికారులు ఇంత వరకు చూడకపోవటం చాలా దారుణం అని అధికారులు నిద్రపోతున్నారా? ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనీస బాధ్యత లేదా R&B అధికారులకు లేదా అని ప్రశ్నించారు. DE గారు బాధ్యత తీసుకుని రోడ్డును బాగు చెయ్యాలి అని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు.  త్రాగు నీరు కలుషితం అవుతున్నాయి అని దీని వల్ల ప్రజలు అనేక రోగాలు బారిన పడుతున్నారు అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది అని గొప్పలు చెప్పి ఈ రోజున గుడివాడ పట్టణంలో అనేక అక్రమ లే అవుట్లు, అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రెవిన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారు అని, రాజకీయ నాయకుల ప్రోద్బలంతో జరుగుతున్నవి ప్రజలు మా దృష్టికి తెచ్చారు. కావున రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలి అని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేసారు. ఈ విధంగా అనేక సమస్యలు గుడివాడ పట్టణంలో ఉన్నాయి అని వాటిపై దృష్టి పెట్టాలి అని మంత్రి కొడాలి నానికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కొదమల గంగాధర రావు(జిల్లా కార్యదర్శి), షేక్ మీరా షరీఫ్, ఇంటూరి గజేంద్ర, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com