మంత్రి కొడాలి నాని హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి : రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్
మంత్రి కొడాలి నాని గారు మాట్లాడుతూ, తాజాగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల దోపిడీపై సంచలన వ్యాఖ్యలు చేయటం జరిగింది. దుర్గమ్మ రధానికి సంబంధించిన వెండి సింహాలు మాయమైతే నష్టమేంటి అని, 8 లక్షల రూపాయల విలువైన వెండి సింహపు విగ్రహాలు మాయమయ్యాయి అని, ఆ 8 లక్షలతో మిద్దెలు కట్టుకుంటామా అని ప్రశ్నించారు. అంతర్వేది రధం దగ్ధం ఘటన గురించి మాట్లాడుతూ, ‘రధం తగలబడితే నష్టమేంటి అని, కోటి రూపాయల దాకా ప్రభుత్వం ఇస్తోంది కదా అని అన్నారు. ఆంజనేయస్వామి విగ్రహం చెయ్యి విరగ్గొట్టడం గురించి మాట్లాడితే అది బొమ్మే కదా చెయ్యి విరిగితే ఆంజనేయస్వామికి ఏమన్నా నష్టముందా అని వ్యాఖ్యానించారు. ఈ మాటలన్నింటిని హిందువుల తరుపున మేము చాలా తీవ్రంగా ఖండిస్తునామని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ కొడాలి నాని గారు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని, మంత్రి అయ్యాక ఆయన నోటికి హద్దూ అదుపూ లేకుండా పోతోంది అని, కేవలం ఎవర్నో తిట్టేందుకే ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టినట్లున్నారు ముఖ్యమంత్రి గారు అని, అదే నిజమైతే, కొడాలి నాని గారు తన బాధ్యతను (మంత్రిగా, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించకుండా.. కేవలం ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడ్డం) సక్రమంగా నిర్వహిస్తున్నట్లే భావించాలేమో అని ఆయన తెలిపారు. రధం తగలబడితే ఆ నష్టమేంటో హిందువులకి తెలుస్తుంది అని, దుర్గమ్మ రధానికి వుండాల్సిన వెండి సింహాలు మాయమైతే, ఆ నొప్పి ఏంటో హిందువులకే తెలుస్తుంది అని, ఆంజనేయస్వామి చెయ్యి విరిగితే, ఆ బాధ ఆంజనేయస్వామిని పూజించేవారికి మాత్రమే తెలుస్తుంది అని, దేశంలో దేవాలయాల్ని ఎవరో ధ్వంసం చేసేస్తోంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అని, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది అని కనీసం ఇన్ని దారుణాలు ఇన్ని దాడులు జరుగుతున్న కనీసం ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు స్పందించకపోవటం చాలా అపోహలకు దారి తీస్తుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడిన మంత్రి కొడాలి నాని గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని హిదువుల తరుపున జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తునమని సాకే పవన్ కుమార్ గారు తెలిపారు.