Logo
Date of Publish : 19 September 2023, 10:50 pm
Editor : Sake Naresh

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి కాకాని డిపాజిట్ గల్లంతవ్వడం ఖాయం

      సర్వేపల్లి ( జనస్వరం ) : వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై మంత్రి కాకాని దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి పదవి కోసం కాకాని ఎంత ప్యాకేజీ ఇచ్చారో ప్రజలకు చెప్పాలి. సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.కోట్లాది రూపాయలు విలువచేసే గ్రావెల్ దందా చేసి ప్రజా సంపదను కొల్లగొట్టి దోచుకున్నారు. గ్రావెల్, మట్టి, ఇసుక వంటి ప్రజా సంపదలను పట్టపగలే దోపిడీ చేస్తుండేది ఎవరు మీరు కాదా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో కల్తీ మద్యం ప్రజలకు పంచి ప్రజల ప్రాణాలతో చెలగాటం మాడి ఆ కేసు మంచి బయట పడేందుకు ఎంత ప్యాకేజీ ఇచ్చి మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు చెప్పగలరా? రాష్ట్రంలో మొట్టమొదటి ప్యాకేజి స్టార్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఎక్కడైనా దొంగలు పడితే కోర్టుకు వెళ్తారు.. అటువంటిది కోర్టులోనే దొంగలు పడితే ఎక్కడికి పోవాలి. గూగుల్ లో కోర్టు దొంగతనం అని సెర్చ్ చేస్తే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మొహం కనబడుతుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు, దోపిడీకి పాల్పడింది ఎవరో ప్రజలందరికీ తెలుసు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీకు డిపాజిట్ రాకుండా ఇంటికి సాగనంపడమే జనసేన పార్టీ లక్ష్యం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిపై అర్థరహిత విమర్శలు చేస్తున్నారు కాబట్టి ప్రజలతో కలిసి మెగా అభిమానులు మీకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెబుతారన్నారు.  ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వెంకటాచలం మండల అధ్యక్షులు పిన్నిశెట్టి మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి శ్రీహరి, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు సుమన్, సీనియర్ నాయకులు ఓబయ్య తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com