రాజంపేట ( జనస్వరం ) : రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన సందర్భంగా... జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ముక్రం చాన్, రాయచోటి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ షేక్ హసన్ భాష, జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ గార్లు మాట్లాడుతూ... ఇటీవల నిన్న అమరావతిలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎలాగైనా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కొట్టాలని అధికార మదంతో మాట్లాడిన పరుష పదజాలంపై తీవ్రంగా ఖండిస్తున్నాం. జోగి రమేష్ నువ్వు ఒక రోగివి మీరు కడుపుకు అన్నం తినే వ్యక్తులైతే మీ శాఖ సంబంధించిన పురోగతిని రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి. గతంలో మీరు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు 30 లక్షల ఇల్లిస్తున్నామని గొప్పలు చెప్పారు కాలనీలు కాదు ఊర్లు నిర్మిస్తున్నామని డప్పులు కొట్టారు. ఎంతవరకు లబ్ధిదారులకు ఎన్ని ఊర్లు నిర్మించారు లబ్ధిదారులకు ఎన్ని గృహాలు నిర్మించి అందజేశారు. మీకు చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే సమీక్ష జరిపి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేవలం మీకు మంత్రి పదవులు ఇచ్చింది జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తి విమర్శలు చేయడానిక? లేక రాష్ట్ర ప్రయోజనాలను ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేటువంటి విధంగా చెప్పడానికా? జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తాను కేసులు పెడతామంటే మేము చూస్తూ ఊరుకోం తీవ్రంగా ప్రతికటిస్తాం. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిరివీర్యమైపోయాయి ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రజలు తీవ్ర మనస్థాపంతో ఉన్నారు మీకు చాతనైతే దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. అంతేకాని ప్రజాసంపదని ప్రకృతి వనరులను దోచుకుంటామంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు రాబోయే కాలంలో మీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మీ ముఖ్యమంత్రి ప్రజలకు కనపడకుండా పరదాలు చాటున దాక్కుని వెళ్లడానికి మీ పైశాచిక ఆనందానికి చెట్లను కూడా నరికేస్తున్నారు. ఇప్పటికైనా కండకావరం తగ్గించుకొని వొళ్ళు దగ్గర పెట్టుకొని రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక సభ్యుడు షేక్ రియాజ్, రాయచోటి పట్టణ నాయకులు, షబ్బీర్ అలీ, ఖాసిమ్, యువ నాయకులు దినేష్,విజయ్, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com