అనకాపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ పేరు విన్నా లేదా పార్టీ నినాదం విన్నా మంత్రి అమర్ ఎందుకు భయపడుతున్నాడో తెలియదు అని అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు అన్నారు. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి అనకాపల్లి మెయిన్ రోడ్ వద్దకు వచ్చిన మంత్రి అమర్ ఆ పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ కళాశాలలో ఉన్న కొంతమంది విద్యార్థులు జై జనసేన అని నినాదాలు చేశారు. కలెక్టర్ స్థాయి అధికారుల సమక్షంలో మంత్రి అమర్ పోలీస్ ఎస్ ఐ దివాకర్ ని ఆ విద్యార్థుల సంగతి చూడమని పంపిస్తే కనీసం సంస్కారం లేకుండా ఎస్ఐ ఆ కళాశాల భవనంలోకి ప్రవేశించి జై జనసేన అని నినాదాలు చేసిన విద్యార్థులను జుత్తు పట్టుకుని ఈడ్చుకెళ్ళి పచ్చి బూతులు తిడుతూ వారిని చితకబాదడం చాలా దారుణమని అన్నారు. డిగ్రీ చదివే విద్యార్థులను ఒక అసాంఘిక వ్యక్తులు లాగా క్రూరంగా కొట్టడం ఎక్కడా జరగలేదు అని అన్నారు. పోలీస్ యూనిఫామ్ లో లేని కొంత మంది వ్యక్తులు సైతం కళాశాలలోకి దూరి విద్యార్థులను కొట్టడం చూస్తుంటే ఇదొక కుట్రపూరితమైన చర్య గా భావించవచ్చు అని అన్నారు. విద్యార్థులు పై దాడి చేసిన ఎస్ఐ దివాకర్ ని తక్షణమే సస్పెండ్ చేసి అతని చేత విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో అనుకూల పరిస్థితులతో పాటు ప్రతికూల పరిస్థితులకు కూడా సిద్ధంగా ఉండాలి తప్ప ఎవరైనా పార్టీ నినాదాలు చేస్తే భౌతిక దాడులు చేయించడం లాంటి పిరికిపంద చర్యలను అమర్ మళ్ళీ పునరావృతం చేసినా జనసైనికుల జోలికి వచ్చినా అమర్ అనకాపల్లి లో తిరగలేని పరిస్థితులు ఏర్పడుతాయి అని హెచ్చరించారు. అనంతరం అనకాపల్లి డీఎస్పీ ని కలిసి సంబంధిత ఎస్సై పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. తప్పకుండా సంఘటన పై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు. అనంతరం పోలీసుల దాడి కి గురైన విద్యార్థుల్లో ఒకరైన జనసేన సానుభూతిపరుడు ఉపేంద్ర ని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్బంగా తీవ్ర భయందోళనలో ఉపేంద్ర తల్లి గారిని కలిసి భాస్కరరావు గారు దైర్యం చెప్పారు. తప్పకుండా జనసేన పార్టీ తరపున తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమం అనంతరం విద్యార్ధి ఉపేంద్ర తన ఇంటిపై ఎగరేసేందుకు అనకాపల్లి జనసేన కార్యాలయానికి వచ్చి జెండా తీసుకుని వెళ్ళాడు. ఈ సందర్బంగా భాస్కరరావు గారు ఆ యువకుడికి జెండా అందజేశారు.