Logo
Date of Publish : 03 July 2021, 6:17 am
Editor : Sake Naresh

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాజీనామా చెయ్యాలి: నెల్లూరు జనసేన నాయకులు

                అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ జనసేన పార్టీ ప్రతినిధులు యువజన విభాగం అధ్యక్షులు గునుకుల కిషోర్‌కుమార్‌ నేతృత్వంలో శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో చాలాచోట్ల ముఖ్యంగా పెన్నానదిలో అక్రమంగా ఇసుక త్రవ్వకాలు, తరలింపులు జరుగుతున్నాయన్నారు. నెల్లూరుసిటీ, నెల్లూరు రూరల్‌కు సంబంధించి అధికార వైసీపీ నేతలు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక అక్రమంగా తరలించేస్తున్నారన్నారు. నెల్లూరుసిటీలో తహసీల్దార్‌ అనుమతులు లేకుండా ఇబ్బడిముబ్బడిగా ఇసుక తరలించారని ఆరోపించిన జనసేన పార్టీ ప్రతినిధులు ఇళ్ళప్లాట్ లెవలింగ్ పేరుతో మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ అనుచరులు రూ. 100 కోట్ల విలువైన ఇసుకను తరలించడం జరిగిందన్నారు. గ్రీన్‌ ట్రిబునల్‌ అనుమతి లేనిదే నదీ పరివాహక ప్రాంతాలలో ఇసుక త్రవ్వకూడదన్న నిబందనలు వున్నప్పటికీ నెల్లూరుసిటీ పరిధిలో యధాచ్చగా ఇసుక త్రవ్వకాలు, తరలింపులు జరిగాయన్నారు. కాంట్రాక్ట్‌ అనుమతులు పొందిన మంత్రి అనుచరులు ఇష్టానుసారంగా ఇసుకను తరలించారన్న జనసేన ప్రతినిధులు. అఖిలపక్షాలు స్థలాన్ని పరిశీలించేందుకు వెళితే జేసీబీతో గుంటలను పూడ్చే ప్రయత్నం చేశారన్నారు. త్రవ్వి తరలించిన ఇసుకలో ఒకశాతం మాత్రమే భగత్‌సింగ్‌ కాలనీలో లెవలింగ్‌కు ఉపయోగించి మిగిలిన ఇసుకను రాష్ట్రం దాటించారు అన్నారు.. ఇసుక కుంబకోణం గురించి నెల్లూరు ప్రజలకు మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ సమాధానం చెప్పాలన్నారు. ఈ దోపిడీపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. సహజ వనరుల దోపిడీకి పాల్పడ్డ అనిల్‌కుమా ర్‌యాదవ్‌ అందుకు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు ఈ సందర్బంగా డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నినాదాలు చేసిన జనసేన ప్రతినిధులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రములో జనసేన నాయకులు, జనసైనికులు మరియు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com