వేమూరు ( జనస్వరం ) : మంత్రి గారూ మీ ప్రభుత్వం రాష్ట్ర కోసం, ప్రజల కోసం ఏం చేసిందో చెప్పండి' అంటూ జనసేన నాయకురాలు సోమరౌతు అనూరాధ రాష్ట్ర సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జునను ప్రశ్నించారు. గ్రామంలో గడప గడపకు కార్య క్రమంలో పాల్గొన్న మంత్రి జనసేన జిల్లా కార్యదర్శి సోమరౌతు అనూరాధ ఇంటి వద్దకు వెళ్లగానే ఆమె 12 ప్రశ్నలతో కూడిన పత్రాన్ని ఆయనకు అందించారు. అందులో.. మన రాజధాని ఏది? ఎక్కడుంది?. ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా తెస్తానన్నారు ఎక్కడ? వంటి ప్రశ్నలు సంధించారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. మీరడిగే సమస్యల్లో ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నవన్నీ పరిష్కరించామని, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించే అవకాశం లేదంటూ అక్కడి నుంచి ముందుకు కదిలారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com