Logo
Date of Publish : 21 November 2023, 9:09 pm
Editor : Sake Naresh

మైనర్లుపై మతి లేని దారుణాలు అడ్డుకోవాలి

         అనంతపురం ( జనస్వరం ) : పేదరికమే వారి పాలిట శాపంగా మారుతోందని బతుకు మీద ఆశతో పెద్దల ఇళ్ళల్లో పనికి కుదిరితే నరకం చూపిస్తున్నారని.. శనివారం నగరంలోని రెవెన్యూ కాలనీకి చెందిన మైనర్ బాలిక నరకయాతనకు గురై ప్రభుత్వ సర్వజన అస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని బాలికను జనసేన-తెలుగుదేశం, ఇతర పార్టీ నాయకులు పరామర్శించారు. జనసేన జిల్లా అధ్యక్షులు, అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ సమాచారం అందజేశారు. వారి సూచనల మేరకు నగర అధ్యక్షులు పొదిలి బాబురావు గారు మీడియా వారితో మాట్లాడుతూ.. గోరంట్లకు చెందిన ముస్లిం బాలిక పేదరికం కారణంగా న్యాయస్థానంలో భార్య, భర్త ఇరువురు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లైన వారు ఇంటిలో పని మనిషిగా పెట్టుకున్నారు. అమ్మాయిని అతి దారుణంగా వేదించడమే కాక శరీరం పుండులాగా గాయపర్చన్నారు. ప్రభుత్వ అస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక భయంతో అరుపులు అక్కడ అందరినీ భాదించాయన్నారు. మైనర్లను పనిలో పెట్టుకొరాదని తెలిసిన కూడా వివిధ శాఖల్లోని అధికారులు, ధనవంతులు బాల,బాలికలతో వెట్టి చాకిరి చేయించుకోవడం పరిపాటిగా మారిందన్నారు. మానవత్వం మరచి దారుణాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలికపై జరిగిన అఘాయిత్యం అసలు కారుకులను లోతుగా విచారించి చర్యలు తీసుకోవాలన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com