Search
Close this search box.
Search
Close this search box.

మిలటరీ మాధవరం గ్రామంలో జనసేన పల్లెపోరు

   తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : మిలటరీ మాధవరం గ్రామంలో పల్లెపోరులో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ కు గ్రామ ప్రజల ఆడపడుచుల హారతులతో మేల తాళాలతో ఘనస్వాగతం పలికారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మిలట్రీ మాధవరం గ్రామంలో ఇంతటి ఘన స్వాగతం పలికిన గ్రామ అడపడుచులకి గ్రామ నాయకులందరికీ ధన్యవాదాలు చెప్పి వైసీపీ ప్రభుత్వం పై లోకల్ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి వచ్చే మూడు నెలల్లో ఐదు సంవత్సరాలు గడుస్తున్న అభివృద్ధి పనులు అటకెక్కి ప్రజల్ని గాలికి వదిలేసారఅన్నారు. మాధవరం గ్రామ పరిస్థితి చూస్తే 2019 నుంచి నిడదవోలు మాధవరం బ్రిడ్జి కూలిపోతే ఇప్పటివరకు దాని ప్రత్యామ్నాయం లేదన్నారు. వర్షాకాలంలో తుఫాన్ సంభవించినప్పుడు ఎర్రకాలువ గండ్లు వల్ల ప్రతి సంవత్సరం సుమారు వందల ఎకరాల వరకు ముంప్పు వట్టిల్లి ఇక్కడ రైతులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలలో రైతుల కష్టాలు తీర్చలేని ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మనకు అవసరమా అని బొలిశెట్టి శ్రీనివాస్ ఇక్కడ ప్రజలతో వ్యాఖ్యానించారు. ఏప్రిల్ నెలలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించి గ్రామాలు అభివృద్ధి కి కృషి చేసే విధంగా జనసేనను ఎన్నుకోవారన్నారు. వచ్చే ఎన్నికల అనంతరం ఈ మాధవరం గ్రామం సమస్యలను ముందుకు తీసుకెళ్తానని ఇక్కడ ప్రజలకు బొలిశెట్టి శ్రీనివాస్ వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు గరగా విష్ణు ప్రియ, స్థానిక నాయకులు అడ్డగర్ల ప్రసాద్, బండారు నాగరాజు, ఆకుల తాతారావు, గోపిశెట్టి భరతుడు, గరగా శ్రీనివాస్, నార్పిరెడ్డి వీరన్న, కస్సి శ్రీనివాస్, అంకం సూరిబాబు, ముప్పిడి అన్నంనేడి సత్యనారాయణ, సూరిశెట్టి సాయి, బస్ప శివ,జొన్నకూటి వంశీ తదితరులు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way