శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమీందారిపుట్టుగ చెందిన నాగుల హరికృష్ణ వారు ఉండే చోట అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదములో అతని రెండు కళ్ళు, అతని కుడి చెయ్యి దెబ్బతిన్నాయి. వీరు పేద కుటుంబానికి చెందినవారు. వీరి పరిస్థితిని గమనించిన జనసైనికులు అందరూ కలిసి 10000/- రూపాయలు మరియు నిత్యావసర సరుకులను జనసేన నాయకులు దాసరి రాజు గారి చేతుల మీదగా ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సేవా స్పూర్తితో ఆపదలో ఉన్న వారిని మానవత్వంతో ప్రతి ఒక్కరూ ఆదుకోవడం ముఖ్య కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com