సాగునీరు అందించాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్న జనసైనికులు.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో , లావేరు మండలం, మరియు ఎచ్చెర్ల జి. సిగడాం, పొందరు ఆనుకొని ఉన్న మడ్డువలస కుడి కాలువ నుండి వస్తున్న సాగు నీరు గత కొన్ని సంవత్సరాలుగా రాకపోవడం వల్ల చాలా గ్రామాల రైతులు సుమారుగా 5వేల కుటుంబాలు ఈ రిజర్వాయర్ పై ఆధారపడి బతకడం జరుగుతుంది. సుమారుగా 6వేల ఎకరాలకు సాగు నీరు లభిస్తుంది. వీరికి జీవనోపాధి లేక వలసలు కూడా వెళ్లిపోవడం జరుగుతుంది. ఈ యెుక్క సమస్యను ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి శ్రీ కాంతిశ్రీ గారు మరియు చిరంజీవి యువత అద్యక్షులు డా. విశ్వకషేన్ గారికి దృష్టికి జనసేన నాయకులు శ్రీనివాసరావు, అర్జున్ భూపతి, హర్షా తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పైడిరాజు, దుర్గారావు, శ్రీను, బాబాజీ, సింహాచలం, జయప్రకాశ్, నికిల్, అమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్య పై వెంటనే రిజర్వేయర్ దగ్గరకు వెళ్లి తెలుసుకొని JE సుబ్బారావు గారికి, మరియు, శ్రీకాకుళం DEE మరియు, సూపరిండెంట్ గారికి ఈ సమస్యను శ్రీమతి శ్రీ కాంతి శ్రీ గారు జనసేన కార్యకర్తలు సాగునీరు అందించాలని జనసైనికులు అధికారులని కోరారు. సాధ్యమైనంత వరకూ ఈ సమస్యను పరిష్కార౦ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.