గాజువాక ( జనస్వరం ) : రాష్ట్ర భవిష్యత్తు, యువతకు భరోసా పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమని నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని జనసేన నాయకులు అన్నారు. గాజువాక నియోజకవర్గం 85 వార్డు కొత్తూరు గ్రామం నుంచి సుమారు 100 మంది యువకులు వైసిపిని వీడి జనసేన పార్టిలో PAC సభ్యులు, గాజువాక పార్టి ఇంచార్జి కోన తాతారావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో చేరారు. ఈ సందర్బంగా కోన తాతారావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని, కొత్త పరిశ్రమలు తేవటం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటం, అవినీతి లేని పాలనతో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, పార్టీలో చేరిన వారికి తగు గౌరవం ఇస్తామని అన్నారు. త్వరలో నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో వైసిపి నుంచి జనసేన పార్టిలోకి చేరికలు ఉన్నాయన్నారు. జనసేన లో చేరిన వారు సీతిన అప్పారావు, నాగుబిల్లి లక్ష్మణ రావు, నీరం సత్యనారావు, కర్రి కనక రాజు, కృష్ణ తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో పార్టి నాయుకులు గడసాల అప్పారావు, వార్డు అధ్యక్షులు గవర సోమశేఖర్, దుల్ల రామునాయుడు, దాసరి త్రినాద్, బలిరెడ్డి అరవింద్, వసంత్ కుమార్, సీరమసెట్టి వెంకట రావు, కరణం కనకారావు, అట్ట అప్పారావు, అట్ట పెంటా రావు, మురళీదేవి, గంధం వెంకటరావు, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.