Logo
Date of Publish : 24 March 2023, 4:08 pm
Editor : Sake Naresh

వైసీపీ ప్రభుత్వంలో మధ్య తరగతి కుటుంబాలు చిన్నాభిన్నం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

      నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 304వ రోజున 9వ డివిజన్ బంగ్లా తోటలోని జాఫర్ సాహెబ్ కాలువ కట్ట ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా తమ వంతు పోరాటం చేస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా జీవిస్తున్నారని, ఏ ఇంటిని కదిలించినా ఇంటికో సమస్య చెబుతున్నారని అన్నారు. ముఖ్యంగా రేషన్ కార్డులను రేషనలైజేషన్ పేరుతో అడ్డగోలు నిబంధనలు పెట్టి తొలగించడంతో సంక్షేమ పథకాలకు దూరమైన కుటుంబాలు అధికంగా ఉన్నాయని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోవడంతో ఉన్నత చదువులు చదివించేందుకు ఆస్తులు తాకట్టు పెడుతున్న కుటుంబాలు కనిపించాయన్నారు. సొంత ఇంటి ఉన్న వారికి నెల బాడుగల్లాగా ప్రభుత్వ అడ్డగోలు పన్నులు మారాయని, ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ విధానాలపై సంతృప్తిగా లేరని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, పవనన్న వస్తేనే తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయనే ఆకాంక్ష ప్రజల్లో ఉందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com