కరుణ లేని కరోనా అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకుంటునే వుందని రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్యతో పాటు మరణాలు పెరుగుతున్న ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని జనసేనపార్టీ రాష్ట్ర మహిళ సాధికారిక చైర్మన్, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోనే ఆక్సిజన్ అందక అనుమతులు లేని ఒకే ఆసుపత్రిలో మూడురోజుల క్రితం ఐదుగురు రోగులు చనిపోవడం దురదృష్టకరం అన్నారు. కర్నూలులో పోలీసులు వెళ్లి తనిఖీలు చేసేంతవరకు కూడా రోగులు చనిపోయిన విషయం బయటకు రాలేదంటే అనుమతులు లేని ఆసుపత్రుల దందా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని ఇలాంటి ఘోరాలు జరుగుతున్న ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అరకొర సౌకర్యాల లేమి వలననే ప్రజలు అనుమతులు లేని ఆసుపత్రులకు వెళ్తున్నారని అన్నారు. ఆరోగ్య విపత్తు తలెత్తిన పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అవసరమైన సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వానికి ఎంత మాత్రం శ్రద్ధ లేదని, వ్యక్తిగత ప్రచారాలకు రూ, కోట్లు ఖర్చు చేయడం నిలిపి ఆ నిధులను వైద్య ఆరోగ్య శాఖకు మళ్లించాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్తులో ఆక్సిజన్ సరఫరాకు మందులను అందుబాటులో ఉంచేందుకు నిధులు ఎంత విడుదల చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అనుమతులు లేని ఆసుపత్రుల్లో వైద్యం పేరుతో దందాలకు పాల్పడుతు లక్షలు లక్షలు దోచుకుంటున్న వారిపై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కఠినచర్యలు తీసుకోని నిలువు దోపిడీని నివారించాలని తెలిపారు. వైద్యం చేస్తే బ్రతికే రోగులు ఎందరో బెడ్స్ దొరకక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.