● కష్టజీవి – చిరంజీవి
● వెండితెరకు రారాజు అభిమానులకు అన్నయ్య
● గోనెగండ్లలో మెగాస్టార్ 67 వ జన్మదిన వేడుకలు
గోనెగండ్ల, (జనస్వరం) : మకుటం లేని మహారాజు ఆపద వస్తే ఆదుకునే అపద్భాంధవుడు సేవాగుణంలో అందరివాడు అభిమానులు ముద్దుగా అన్నయ్య అని పిలిచే వెండితెర రారాజు మెగాస్టార్ చిరంజీవి 67 వ జన్మదిన వేడుకలను మండల కేంద్రమైన గోనెగండ్లలోని గంజహళ్లి ఆటో స్టాండ్ సమీపంలో మెగా ఫ్యాన్స్ మండల అధ్యక్షులు మాలిక్, ఇస్మాయిల్, బిగ్ బాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. దివ్యంగ అభిమానులు వెంకటేష్, చెన్నప్ప, చేతుల మీదుగా కేక్ కత్తిరించి అభిమానులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ మండల అధ్యక్షులు మాలిక్ మాట్లాడుతూ కష్టాన్ని నమ్మి శ్రమించి స్వయంకృషితో ఎదిగిన కష్టజీవి చిరంజీవి అని కొనియాడారు. అభిమానులకు ఆదర్శంగా నిలుస్తూ విపత్తుల సమయంలో అభిమానులు సైతం ఆదుకొనెల ముందుకు రావాలని సేవా గుణాన్ని అలవరచిన గొప్ప కార్యసాధకుడని అందుకే ఎవరికి అందని ఎత్తుకు ఎదిగి మెగాస్టార్ అయ్యారని ఎన్నో ఏళ్లుగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు రక్తదానం నేత్రధాన కార్యక్రమలు చేస్తూ కరోన సమయంలో ఆక్సిజన్ కొరతను గుర్తించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఆదుకున్న గొప్ప మానవతావాది చిరంజీవి అని తెలిపారు. సినిమా కార్మికుల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని 10 పడకల వైద్యశాలను సొంత నిధులతో నిర్మించుటకు ముందుకు వచ్చారని ఇలాంటి గొప్ప నటుడు మెగస్టార్ చిరంజీవి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. 67 వ జన్మదిన వేడుకల్లో అభిమానులు, గానిగ హాజీవలి, దూద్ పిరా, కౌలుట్ల, ప్రకాష్, నన్నుబుడ్డి మాబు, చికెన్ ఖాసీం, సుబాన్, గౌండ మాబాష, మహమ్మద్, షేక్షవలి, ఖాసీం, పులికొండ, గూడూరు సాధిక్, ఉస్మాన్, మహబూబ్ బాషా,అనీఫ్ తదితరులు పాల్గొన్నారు.