Logo
Date of Publish : 27 October 2020, 4:09 pm
Editor : Sake Naresh

ఎమ్మిగనూరులో కళాకారులకు చేయూతనిచ్చిన జనసైనికులు, మెగాఫ్యాన్స్

ఎమ్మిగనూరులో కళాకారులకు చేయూతనిచ్చిన జనసైనికులు, మెగాఫ్యాన్స్

                    రంగస్థల కళాకారులకు జనసైనికులు, మెగాఫ్యాన్స్ సేవా సమితి తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ రూ.5000/- చేయూత అందించారు. మండల కేంద్రమైన గోనెగండ్లలో మంగళవారం రోజు మెగాఫ్యాన్స్, జనసైనికులు మండల అధ్యక్షులు మాలిక్ అధ్యక్షతన రంగస్థల కళాకారుల చేయూత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాకారులు చరిత్రకారుల నాటకాలు మొదలుకొని సినిమా పాటలు మిమిక్రిలు చేసుకుంటూ జీవనం సాగించే వారి వెలుగుల జీవితాల్లో కరోనా రూపంలో చీకటి రోజులు వచ్చి జీవోనోపాధినే కాటు వేసిందని తెలిపారు. ప్రభుత్వం అన్ని రంగాలవారిని గుర్తించి రంగస్థల కళాకారులను విస్మరించిందని అన్నారు. గ్రామ మండల స్థాయి ఉత్సవాలలో రాజకీయ పార్టీల సమావేశాల్లో ప్రజలను యువతను తమ ఆట పాటలతో అలరిస్తూ బాధ్యతాయుతంగా కార్యక్రమాలకే వన్నె తెచ్చే కళాకారుల మనుగడ నేడు కరోనా దెబ్బతో అంతరించేలా వుందని ఆవేదన వ్యక్తంచేశారు, సమాజంలో వారు చేస్తున్న వృత్తిని ప్రభుత్వాలు గుర్తించి విపత్కర పరిస్థితుల్లో కళాకారులను ఆర్ధికంగా అదుకోవాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరి వారిలా భావించే కళాకారులకు అందరు కలిసి మేము ఉన్నామంటూ ధైర్యాన్ని చేయూత రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మెగాఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో చేసిన ఎన్నో సేవా కార్యక్రమాల్లో కళాకారులకు చేయూత అందించిన కార్యక్రమం గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగస్థల కళాకారులు కరుణాకర్, ఖాజావలి ఓంకార్, నాగముని, మురళీకృష్ణ, మెగా ఫ్యాన్స్ మండల ప్రధాన కార్యదర్శి, యుగంధర్, ఉపాధ్యక్షుడు, రాముడు, చాంద్, వెంకటేష్, ఉరుకుందు, శ్రీను, వీరేష్, ఖాసీం, జానీ, షఫీ, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com