Logo
Date of Publish : 27 March 2022, 3:12 pm
Editor : Sake Naresh

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఘనంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

    ఎమ్మిగనూరు, (జనస్వరం) : ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవాసమితి ఆధ్వర్యంలో రామ్ చరణ్ జన్మదిన వేడుక సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక శివ ప్రియ టాకీస్ నందు కేక్ కటింగ్ చేసి 101 గుమ్మడికాయలతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి హారతి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షుడు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్ మాట్లాడుతూ మెగా అభిమానుల మధ్య అభిమాన హీరో రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. అదే విధంగా ఇటీవల రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ సినిమా రామ్ చరణ్ గారి నటన అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగువారి సత్తాని దేశం నలుమూలల్లో చాటారని కొనియాడారు. ఇకపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోయే ప్రతి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ సాధిస్తూ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అభిమాన హీరోపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, గురు, చైతన్య, గిరి, గోవర్ధన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com