దాదాపు డెబ్బయ్ దఫాలుగా జాతీయ సినీ పురస్కారాల ప్రకటన జరుగుతోంది. తొలిసారిగా ఓ తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం ప్రకటితమయ్యింది.! చిన్న విషయం కాదిది.! అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్‌గా మారిన స్టైలిష్ స్టార్‌కి జాతీయ పురస్కారం వరించిన దరిమిలా, మెగా సంబరాలు జరుగుతున్నాయ్. తెలుగు మీడియా, జస్ట్ అలా స్పందించి ఊరుకుందంతే.! ఇదే, ఇంకెవరికైనా ఇంతటి గౌరవం దక్కి వుంటే.! అది వేరే లెవల్లో వుండేదేమో.! అంటే, మీడియా కవరేజ్ విషయంలో. నో డౌట్.. ఇవి మెగా పురస్కారాలే.! అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాకి రెండు పురస్కారాలు వచ్చాయ్. ఒకటి హీరోకి, ఇంకోటి సంగీత దర్శకుడికి. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమాకి ఏకంగా ఆరు పురస్కారాలొచ్చాయి. ఎన్టీయార్ ఈ సినిమాలో మరో హీరోగా నటించాడు. కొరియోగ్రఫీ సహా పలు విభాగాల్లో పురస్కారాలు ప్రకటితమయ్యాయి. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన 'కొండ పొలం' సినిమాకి ఓ పురస్కారం వచ్చింది. అదీ, అందులోని పాటకి.!
ఇక, పంజా వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన' సినిమాకీ ఉత్తమ చిత్రం - తెలుగు కేటగిరీలో జాతీయ పురస్కారం దక్కింది. అంటే, దాదాపు అన్నీ మెగా జాతీయ పురస్కారాలేనన్నమాట. అదీ అసలు ఏడుపు. స్మగ్లర్ పాత్రలో నటించిన అల్లు అర్జున్‌కి జాతీయ పురస్కారమిచ్చి ఏం సందేశాన్ని సభ్య సమాజానికి ఇస్తున్నారు.? అంటూ, కొన్ని మీడియా సంస్థలు దీర్ఘాలు తీశాయి. ఎవరు మెగా నెంబర్ వన్ హీరో.? అంటూ ఇంకొన్ని మీడియా సంస్థలు దిక్కుమాలిన చర్చలు పెట్టాయ్. అల్లు అర్జున్ మెగా కాదు, జస్ట్ అల్లు.. అంటూ కొత్త రచ్చకు తెరలేపారు. వెరసి.. తెలుగు సినిమాకి 'మెగా' జాతీయ పురస్కారాలొచ్చాయన్న గొప్ప విషయాన్ని కనుమరుగు చేయడానికి, తెలుగు మీడియా పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇదేం పైత్యం.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మెగాభిమానులు ఈ మెగా జాతీయ పురస్కారాల్ని మాత్రం మేగ్జిమమ్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com