కడప ( జనస్వరం ) : ఘనంగా వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు వేడుకను కడప మెగా కుటుంబ అభిమాని అబ్బన్న గారి రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు పండ్రా రంజిత్ కుమార్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు..ఈ సందర్భంగా కడప జిల్లా పరిషత్ పక్కన ఉన్న పట్టణ నిరాశ్రయుల ఆశ్రమంలోని నిరుపేద అభాగ్యులకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు రంజిత్, రాజగోపాల్ చేతుల మీదుగా పంచి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైష్ణవ్ తేజ్ మేనమామలు చిరంజీవి పవన్ కళ్యాణ్ ల అడుగుజాడల్లో నడుస్తూ మరిన్ని మంచి చిత్రాలలో నటిస్తూ తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తూ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు శ్రీనివాసులు రెడ్డి, మెగా అభిమానులు బాలు నాయక్, సుధీర్ నాయక్, వినోద్, రాజశేఖర్, మరియు అభిమానులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com