ఎమ్మిగనూరు ( జనస్వరం ) : తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక వేదాస్ వృద్ధాశ్రమం నందు నిత్యాసర సరుకులు పంపిణీ చేశారు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ 37వ జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ కార్యదర్శి భరత్ సాగర్ మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచితనాన్ని, మానవత్వాన్ని పెంచుతున్న సుప్రీం హీరో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఆయన చేపట్టబోయే సేవా కార్యక్రమాలు అయితేనేమి సినిమాలు అయితేనేమి విజయం సాధించాలని కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం ఎల్లప్పుడు సుప్రీం హీరో సాయి ధరంతేజ్ పై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్, చైతన్య, శివ, రాము పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com