ఎమ్మిగనూరు ( జనస్వరం ) : మెగాపవర్ స్టార్ రాం చరణ్ ఉపాసన దంపతులకు కూతురు పుట్టిన సందర్భంగా మెగా అభిమానుల సంబరాలు చేసుకున్నారు. ఈసందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన గారికి కూతురు పుట్టిన శుభ సందర్భంగా ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక వేదాస్ వృద్ధాశ్రమం నందు కేక్ కట్ చేసి 30 మందికి అల్పాహారం పంచి సంబరాలు చేసుకున్నారు. గత 11 సంవత్సరాలుగా ఎదురుచూసిన క్షణం ఈరోజుతో పూర్తయిందని మంగళవారం రోజున మెగా కుటుంబాల్లో మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టడం పుట్టడం తముకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని రాబోయే రోజుల్లో కూడా మెగా కుటుంబంలో ఇలాంటి మధురమైన క్షణాలు మరెన్నో జరగాలని రావాలని దేవుని కోరుకుంటున్నామని మెగా కుటుంబం మెగా అభిమానులపై దేవుడి కృప కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మెగా అభిమానులైన తమకు ఇలాంటి సంతోషమైన క్షణాలు మరిన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్ణం రవి, శేఖర్, రషీద్, వినోద్, పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com