Logo
Date of Publish : 14 October 2022, 3:38 pm
Editor : Sake Naresh

మెగా అభిమానులు అంటే సమాజ సేవకులు :- అనంతపురం జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ

● అమృత వర్షిని ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం
● రేపు జరగబోవు "మెగా రక్తదాన శిబిరాన్ని" జయప్రదం చేయండి
● రక్తదానం చేద్దాం పుణ్యకార్యంలో పునీతులు అవుదాం
● గుంతకల్ పట్టణ రాష్ట్ర సాయిధరంతేజ యువత అభిమానులు

         గుంతకల్లు, (జనస్వరం) : అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ, పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా గుంతకల్ పట్టణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాయిధరమ్ తేజ్ యువత ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణం స్థానిక అమృతవర్షిని బాలుర కళ్యాణ ఆశ్రమం నందు అన్నదాన వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంతరం జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ మెగా అభిమానులు అంటే సమాజసేవకులు అనే సరికొత్త నిర్వచనాన్ని తెలుపుతూ గుంతకల్ పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్క మెగా అభిమానికి అభినందనలు తెలిపారు. మరీ ముఖ్యంగా రేపు గోపి బ్లడ్ బ్యాంకు నందు జరగబోవు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న పవర్ శేఖర్ & టీం శుభాభినందనలు తెలిపి పురప్రజలు, మెగా జనసైన్యం సభ్యులు ఈ పుణ్యకార్యాన్ని జయప్రదం చేయాలని ఆయన ప్రత్యేకంగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కురుబ పురుషోత్తం, బండి శేఖర్ రాష్ట్ర సాయి ధరంతేజ్ యువత అధ్యక్షులు పవర్ శేఖర్, గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, ఆటో రామకృష్ణ, మంజు, అమర్నాథ్, పాపయ్య, ఆటో కృష్ణ, శివ కుమార్, రామకృష్ణ, కొనకొండ్ల శివ, రమేష్ రాజ్, హెచ్ పి సి శేఖర్, ఆటో పాండు, భాష తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com