భారతదేశంలోనే రెండవ అతిపెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారం వచ్చిన శుభ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడమైనది అని ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి అధ్యక్షులు రాహుల్ సాగర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలే హైదరాబాదులో ఏర్పాటు చేసిన మెగా ఫ్యాన్స్ సమావేశంలో చిరంజీవి గారిని కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. రక్తదానం నేత్రదానం వైపు నడిపిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో భారతరత్న పురస్కారంతో సత్కరిస్తుందని ఆశాభవాన్ని వ్యక్తపరిచారు.