ఎమ్మిగనూరు ( జనస్వరం ) : రాహుల్ సాగర్ మెగా అభిమానుల ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారికి భారత దేశంలోనే రెండవ అతిపెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారం వచ్చిన శుభ సందర్భంగా ఎమ్మిగనూర్ తాలూకా మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ కార్యదర్శి భరత్ సాగర్ మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి రక్తదానం నేత్రదానం లాంటి సేవా కార్యక్రమాలతో ఎందరో ప్రాణాలు కాపాడిన మనసున్న మహారాజు మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు. ఇది కాక 2020 21 లో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎందరో ప్రాణాల్ని కాపాడిన గొప్ప వ్యక్తి అని అలాంటి సేవ పూర్తి కలిగిన తమ అభిమాన నటుడైన చిరంజీవి గారికి పద్మ విభూషణ్ పురస్కారం రావడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. రాబోయే కాలంలో ఇలాంటి పురస్కారాలు ఎన్నో మరెన్నో రావాలని భారతదేశంలో అతిపెద్ద పురస్కారమైన భారతరత్నం మెగాస్టార్ చిరంజీవి గారికి అతి త్వరలో వరించాలని కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామిని ఆర్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోజ్, చిట్టిబాబు, రమేష్, వీరేష్, నరేష్, రషీద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.