Logo
Date of Publish : 24 May 2022, 5:47 pm
Editor : Sake Naresh

రాజంపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

     రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట మరియు అన్నమయ్య జిల్లాలో వివిధ ఆరోగ్య సమస్యలతో రక్తం అవసరమై సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాజంపేట నగరంలో ఆర్ అండ్ బి బంగ్లా ఎదురుగా ఫ్యూచర్ మైండ్ స్కూల్ ఆవరణలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ దీపా బ్లడ్ సెంటర్ వారి సహాయ సహకారాలతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది. తలసేమియా, క్యాన్సర్ లాంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే రోగులకు పేద వారికి ఉచితంగా రక్తాన్ని ఇచ్చే శ్రీ దీపా బ్లడ్ బ్యాంక్ రాయచోటి వారి సహాయ సహకారాలతో ఆహా రాజంపేటలో బంగ్లా ఎదురుగా ఫ్యూచర్ మైండ్ స్కూల్ లో ఈరోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జనసేన నాయకులు కార్యకర్తలు సామాన్య ప్రజలు యువత పాల్గొనడం చాలా సంతోషకరం జనసేన నాయకులు ఎం వెంకటేశ్వరరావు గారు తెలిపారు. రాజంపేట ఒక పార్లమెంట్ స్థానం అయినా ఇప్పటికీ వైద్యాన్ని విస్మరిస్తూ కడప తిరుపతి మధ్యలో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. రాజంపేటలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ట్రామా సెంటర్ దాదాపు ఏడు సంవత్సరాల నుండి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం దౌర్భాగ్యం అన్నారు. అనస్థీషియా లాంటి అత్యవసర ఈ పరిస్థితుల్లో డాక్టర్ల కొరత, మౌలిక వసతుల సమస్య మరియు బ్లడ్ బ్యాంక్ ను కూడా పూర్తిగా అభివృద్ధి చేయలేకపోవడం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. రాజంపేట అభివృద్ధి కోసం అధికార పార్టీ నాయకులు కృషి చేయడం లేదని యుద్ధ ప్రాతిపదికన అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది అని జనసేన పార్టీ నాయకులు బాల సాయి కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైద్య అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట జనసేన నాయకులు గోపి కృష్ణ, హరి కృష్ణ కోలాటం, మల్లికార్జున రాయల్, చలపతి, జిల్లా లీగల్ ప్రెసిడెంట్ కర్ణాకర్ రాజు గారు వైస్ ప్రెసిడెంట్ కత్తి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com