బనగానపల్లి ( జనస్వరం ) : బనగానపల్లె పట్టణంలో జనసేన పార్టీ నాయకుడు భాస్కర్ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసైనికులు కృషి చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడంలో ముందు ఉంటారని అన్నారు. రక్తహీనలతో బాధపడే గర్భిణీ స్త్రీల కోసం అలాగే తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు పెద్ద కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కనుక ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని రక్తదానం ప్రాణదానం తో సమానం అని అన్నారు. ఈ కార్యక్రమానికి కొలిమిగుండ్ల మండల నాయకులు పెద్దయ్య, ప్రతాప్ జనసైనికులు బనగానపల్లె జనసైనికులు హాజీవలీ, శివరాంరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆచారి, భాస్కర్ రెడ్డి, శివ, మద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com