Logo
Date of Publish : 21 August 2025, 10:47 am
Editor : Sake Naresh

కువైట్‌లో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

కువైట్, జనస్వరం, ప్రత్యేక ప్రతినిధి : జనసేన పార్టీ అధినేత, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో ఒక మహా రక్తదాన శిబిరం నిర్వహించబడుతోంది. ఈ శిబిరం ఆగస్టు 29వ తేదీ మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు జబ్రియా బ్లడ్ బ్యాంక్‌లో జరుగనుంది.

ఈ కార్యక్రమాన్ని గల్ఫ్ జనసేన కన్వీనర్‌లు కంచన శ్రీకాంత్, రామచంద్ర నాయక్, అంజన్ కుమార్, ఆకుల రాజేష్, బిరదా సూర్య సమన్వయంతో, కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతీ ఏటా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా భారీ స్థాయిలో రక్తదానం జరగాలని నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

కువైట్‌లోని మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, కూటమి భాగస్వామ్య నేతలు అందరూ ఈ రక్తదాన శిబిరానికి తరలి వచ్చి పాల్గొని విజయవంతం చేయాలని కన్వీనర్ కంచన శ్రీకాంత్ పిలుపునిచ్చారు. సమాజానికి మేలు చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ద్వారా పవన్ కళ్యాణ్‌కి అభిమానుల అనుబంధం ఎంత బలంగా ఉందో మరోసారి నిరూపిద్దాం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన నేతలు మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన ఆచరణలో పెట్టే విలువలను అనుసరించి మేము కూడా కువైట్‌లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం” అని పేర్కొన్నారు. గల్ఫ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ శిబిరంలో పాల్గొని మానవత్వాన్ని చాటాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com