కదిరి, మార్చి24 (జనస్వరం ) : మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వారోత్సవాలలో భాగంగా మన అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి, రామ్ చరణ్ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కదిరి ప్రభుత్వం ఏరియా హాస్పిటల్ నందు మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో నారాయణ స్వామి, చంద్ర మోహన్, బావాజీ, మురళి, శివ కుమార్, ప్రదీప్, వెంకటేష్, మనోహర్, లక్ష్మణ, రాజేంద్ర, కార్తిక్, హరీష, వాల్మీకి, దేవలం కార్తిక్, ముని గోపాల్, పవన్ కళ్యాణ్, అనిల్, మధు సుధన్, సాయి కుమార్ తదితర మెగాఅభిమానులు స్వఛ్చందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు లక్ష్మణ కుటాల, రామ్ చరణ్ యువ ఫౌండేషన్ అధ్యక్షులు మనోహర్ మాట్లాడుతూ " సమాజం కోసం మంచి చెయ్యాలనే తపనతో నిత్యం మెగాస్టార్ చిరంజీవి రక్తం అందక ఎవరూ చనిపోకూడదనే ఒక సంకల్పంతో చిరంజీవి బ్లడ్ & ఐ బ్యాంక్ స్థాపించి సేవ చేస్తున్నారని అన్నారు. అదే సేవా స్ఫూర్తిని ఆదర్శంగా కొణిదెల రామ్ చరణ్ బాధ్యతతో సమాజ సేవా కార్యక్రమాలలో నిత్యం అభిమానులను సమాయత్తం చేస్తున్నారు. అటువంటి గొప్ప సినీనటుడు, మంచి మనిషి రామ్ చరణ్ అని తెలిపారు.ఈ నెల 27 వ తేదీన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజును మెగా అభిమానుల ఒక పండగలాగా అభిమానుల పుట్టిన రోజు వేడుకలను చేసుకుంటున్నాం అదే క్రమంలోనే అఖిల భారత చిరంజీవి యువత ,రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి , రామ్ చరణ్ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఆయన నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో జీవించాలని మనస్పూర్తిగా ఆ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థిస్తున్నామని ,రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్త దాతకు పేరు పేరునా టీమ్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com