కళ్యాణదుర్గం ( జనస్వరం ) : ములకలేడులో జరిగిన జనసేన-టిడిపి ఉమ్మడి ఆత్మీయ సమన్వయ సమావేశంకు కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మండల అధ్యక్షులు కాంత్ రాజు సభకు అధ్యక్షత వహించగా, టిడిపి తరఫున టి.ఆర్.తిప్పేస్వామి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జనసేన-టిడిపి ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి ప్రచారం, రెండు పార్టీలు కలిసి సమన్వయంగా కలిసి ఎలా ముందుకు వెళ్లాలి? మొదలైన అంశాలను చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో టిడిపి మాజీ జెడ్పిటిసి గురు ప్రసాద్, టిడిపి ముఖ్య నాయకులు రామరాజు, ఆదిశేషు, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు చెర్లోపల్లి రామలింగ, మహేష్, ప్రధాన కార్యదర్శులు నరసింహమూర్తి, గురుస్వామి, లక్ష్మణ్, కార్యదర్శులు నరసయ్య, గంగాధర, మారెన్న, జనసేన-టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com