మూడు రాజధానుల గురించి నెల్లూరు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం
• 2014కు ముందు ఆంధ్రప్రదేశ్ ని రెండు ముక్కలుగా అడ్డగోలుగా విభజన చేసి ప్రత్యేక హోదా ఇస్తానంటూ మాయమాటలు చెప్పి ఇవ్వకుండానే ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ హఠావో అంటూ పిలుపుని ఇచ్చి ప్రజల తరపున నిలబడ్డారు…
• అనంతరం అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ గ్రాఫిక్స్ లో మాయాజాలం చేసి సింగపూర్ తరహా లో రాజధాని నిర్మించాలని చెప్పి ల్యాండ్ పూలింగ్ పేరుతో 32 వేల ఎకరాలు సంవత్సరానికి 3 సార్లు పండే భూమిని రైతుల వద్ద తీసుకున్నారు..
• ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వేల ఎకరాల సేకరణ అవసరం ఏముంది మూడు వేల ఎకరాల్లో సరిపోతుందని ఒకవేళ 32 వేల ఎకరాలు అవసరం అయితే రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం వారు మారవచ్చు, అని ప్రజా రైతుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భూములను త్యాగం చేసే రైతులకు చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని ఆరోజే తెలియజేశారు.
• నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి ప్రభుత్వం దీనిని వ్యతిరేకించకపోగా, ప్రాంతీయ సమస్యలు సృష్టించబోమని మూడు వేల ఎకరాలు చాలదని 32 వేల ఎకరాలు తీసుకోవాల్సిందేనని వంతపాడారు.
• రాజధాని పేరుతో నిర్మాణాలలో అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసింది టిడిపి ప్రభుత్వం అని అభియోగం చేసిన వై.సీ.పీ ప్రభుత్వం దాని పైన విచారణ చేపట్టి చర్యలు చేపట్టకపోగా మూడు రాజధానులు అనే కొత్త అంశాన్ని లేవనెత్తింది.
• రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం మారినపుడల్లా రాజధానిని మరుస్తుపోతే పెట్టుబడుదారుల నమకం కోల్పోతాము, జరగాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ గాని పరిపాలన వికేంద్రీకరణ కాదు అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయవద్దని ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోతే వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కానీ, అభివృద్ధి సాధించలేము అని రాష్ట్రము విడిపోయి 7సంవత్సరాలు అవుతున్న మన రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది అని తెలిపారు.
• ఒకసారి ఈ పార్టీని ఒకసారి ఆ పార్టీని విమర్శించుకుంటూ పోతారు ఆయన గురించి మాట్లాడడానికి ఏమీ లేవు అనే నాయకులారా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ పవన్ కళ్యాణ్ తన గళం వినిపిస్తున్నారు.
• లక్ష కోట్లతో రాజధాని అనేది టిడిపి అన్నప్పుడు కానీ వైసిపి మూడు రాజధానులు ఉన్నప్పుడు కానీ జనసేన ప్రయోజనం కానీ, ప్రమేయం కానీ ఏమీ లేదు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రశ్నించడం తప్ప.
• టిడిపి వైసిపి పార్టీలు రెండూ ఒకటే లాంటివి, పాత కక్షలతో వ్యక్తిగత ప్రయోజనాల దృష్ట్యా పనిచేస్తన్నాయి, రైతులకు ఆశలు రేకెత్తించిన టిడిపి ప్రభుత్వం కానీ రాజధాని వికేంద్రీకరణ పేరుతో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న వైసీపీ ప్రభుత్వం గానీ దీనికి సమాధానం చెప్పాలి.
• కనీస బాధ్యత వహిస్తూ టిడిపి ఎమ్మెల్యేలు 23 మంది ఎన్నికలప్పుడు రాజధాని ఏది ఉండబోదని తెలపకుండా కృష్ణ మరియు గుంటూరు జిల్లాలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటం చేయాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాము.
• కోవిడ్ విపరీతంగా వ్యాపిస్తున్న తరుణంలో రాజధాని వికేంద్రీకరణ పై న్యాయ కోవిదులు నిపుణులతో చర్చించి జనసేన పార్టీ ఒక నిర్ణయానికి వస్తుంది.
• ప్రజల అభిమానంతో నెల్లూరు జిల్లాలో 10 కి 10 స్థానాలను కైవసం చేసుకున్నాము అని చెప్పుకుంటున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.
• నెల్లూరు లో భాగమైన శ్రీ సిటీ మేనకూరు సెజ్,కృష్ణపట్నం పోర్టు, ముత్తుకూరు పవర్ ప్లాంట్ లు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం, పులికాట్ సరస్సు, సోమశిల, గూడూరు సిలికాన్ మైకల్ మైనింగ్ ఇవన్నీ నెల్లూరు జిల్లా సంపదలతో నో ఏర్పాటు చేసినవి మరియు అభివృద్ధి పరిచినవే.
• ఉద్యోగాలు, జీవనభృతి, ఆర్థిక ప్రగతి వస్తుందని ఆశ పడ్డాము, కానీ నేడు చేస్తున్న విభజన వల్ల సూళ్లూరుపేట సర్వేపల్లి గూడూరు వెంకటగిరి తిరుపతి జిల్లాకి పోతే నెల్లూరు జిల్లా ఆర్థిక పరిస్థితులు ఏమిటి.?
• వీటి వల్ల వచ్చే కాలుష్యం మాత్రమే మీకు ఆదాయాలు ఉద్యోగాలు వేరే వారికి అంటే ఎలా… ఉదయగిరి ఆత్మకూరు తదితర ప్రాంతాలతో పూర్తిగా కరువు ప్రాంతంగా నెల్లూరు జిల్లా మారిపోతుంది..
• నిత్యం ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ ఏ పార్టీ తరఫున ప్రజలకు అన్యాయం జరుగుతుందో ఆ పార్టీని ప్రశ్నిస్తున్నపవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఆపి, జిల్లా వాసులు నమ్మకాలను నిలబెట్టేందుకు జిల్లా ప్రయోజనాల దృష్ట్యా పని చేయవలసిందిగా ఈరోజు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూర్ జిల్లా నాయకులు గునుకుల కిషోర్ కుమార్ , కొట్టే వెంకటేశ్వర్లు , Dr. అజయ్ కుమార్ , సుల్తాన్ బాషా మరియు జనసైనికులు పాల్గొన్నారు.