దేశంలో మరియు రాష్ట్రంలో గాని మరియు ఇతర ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో ప్రజలకు పోర్ట్ఎస్టేట్ అయిన మీడియా ప్రజలు పడుతున్న ఇబ్బందులను మరియు ప్రజలను చైతన్యవంతం చేయడంలోనూ, వ్యాధి నివారణకు, ప్రాణాలకు తెగించి విలేకరులు వార్తలు సేకరిస్తూ నిరంతరం covid 19 నివారణకు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా కృషి చేస్తున్నారు. వారిని మనమందరం కూడా అభినందించాలని జనసేన నాయకులు దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు విలేకరులు వార్తల సేకరణకు వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది వారిని అడ్డగిస్తున్నారు. గౌరవ సుప్రీంకోర్టు వార్తా సేకరణ ఎక్కడైనా చేయొచ్చు అని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ తమ తీర్పును వెలువరించిన సంగతిని రాష్ట్ర ప్రభుత్వం గానీ జిల్లా అధికారులు గానీ గుర్తుంచుకోవాలి. అందుకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్పత్రిలో వార్తా సేకరణ కు వెళ్ళిన విలేకరులను పోలీసు సిబ్బంది చేత అడ్డుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది పత్రికా స్వేచ్చకు మీడియా స్వేచ్ఛకు ఆటంకం కాదని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తది. అయితే నిన్న జిల్లా కలెక్టరు ఒక ప్రకటన జారీ చేస్తూ మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు విలేకర్ల స్వేచ్ఛగా వెళ్ళవచ్చు అన్నారు. క్షేత్రస్థాయిలో వారి ఆదేశాలు అమలు కాలేదని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తఉంది. ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రి నందు లోపాలు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన వార్తలు మీడియాలో ప్రచారం అయి ప్రచురితమైన వాటిని సరిదిద్దుకోవాలి తప్ప, అధికారులు నిర్దాక్షిణ్యంగా మీడియాను అనుమతి లేదంటూ వెనక్కి పంపడం చాలా విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విలేకర్ల అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇచ్చి వార్తలు స్వీకరించమని అవకాశం కల్పిస్తే ఇక్కడ వాటి అమలు కావడం లేదు. అన్నది ఇక్కడ మనము గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. అయితే జిల్లా అధికారులకు సన్నిహితంగా ఉన్న ఒకరిద్దరు (విలేకరులు కాని వారు) ప్రభుత్వ ఆసుపత్రిలో ఫోటోలు తీయడం వీడియోలు షూట్ చేయడం వాటన్నింటినీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ప్రచారం పొందుతున్న తరుణంలో విలేకరులకు మాత్రం అనుమతి లేదు. సంబంధం లేని వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉందా..! అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకవేళ లోపాలు ఉంటే ఉండొచ్చు గాక వాటిని సరిదిద్దుకోవడానికి మరింత మెరుగైన సేవలు రోగులకు అందించటానికి ఈ వార్తలు ఉపయోగపడతాయి తప్ప మరేమీ కాదు అన్న విషయాన్ని జిల్లా అధికారులు గుర్తించుకొని ఇప్పటికైనా మీడియాను ప్రభుత్వ ఆసుపత్రిలో అనుమతించకుండా ఉన్నటువంటి మౌఖిక ఆదేశాలను ఎత్తివేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికారులను కోరుతున్నది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com