ఒంగోలు ( జనస్వరం ) : ఒంగోలు లోని జనసేన పార్టీ కార్యాలయం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించిన నాయకులు,ఈ సందర్బంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు గారు మాట్లాడుతూ మెగా అభిమానులం అని చెప్పుకుంటూ, మీ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి మెప్పు కోసం మెగా అభిమానుల్లో చీలిక తీసుకొని వస్తాము అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఉండరు అని, రియాజ్ గారి గురించి మాట్లాడే స్థాయి నీదా అని, పార్టీలో ఉన్నప్పుడు నువ్వు పార్టీనీ అడ్డం పెట్టుకొని ఏం సంపాదించావో అవి కూడా చెప్తే అందరూ తెలుసుకుంటారని, పార్టీని జిల్లాలో నడిపిస్తూ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న మా అధ్యక్షులు షేక్ రియాజ్ గారిని ఇంకోసారి విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని అన్నారు. మరియు ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ మాట్లాడుతూ అభిమానాన్ని జిల్లాలో అమ్ముకున్న వ్యక్తివి నువ్వు, అలాంటి నువ్వా మా అధ్యక్షులు రియాజ్ గాని విమర్శించేది. ఈరోజు ఒంగోలు లో ప్రజా సమస్యల మీద పోరాడుతూ షేక్ రియాజ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ బలంగా ముందుకు వెళుతుంది. అటువంటి ఈ తరుణంలో సుబ్బారావు గుప్తా వ్యవహారాన్ని డైవర్ట్ చేయటానికి ఎవరి మెప్పు పొందటానికి నువ్వు ఇలాంటి చౌక్ బారు మాటలు మాట్లాడుతున్నావ్, ఇన్నాళ్లు ఓపిక పట్టాం, ఇంకా చూస్తూ ఊరుకునేది లేదు ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కొని లేరు, నీకు సేవాదళ్ పదవి రియాజ్ గారు ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ ఉండే వాడివి, టిడిపి వాళ్లకి పార్టీని అమ్మేశారు అని అన్నావు. నువ్వు ఏమైనా మీడియేషన్ చేసావా, చేస్తే ఆధారాలతో నిరూపించు అంతేగాని ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటం మానుకో అని అన్నారు,మరియు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ మాట్లాడుతూ ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో జిల్లా లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించిన వ్యక్తి రియాజ్ గారు అని, అలాంటి వ్యక్తి మీద ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటం మానుకోవాలని, ఎంతోమంది ఉన్నా సేవాదళ్ కోఆర్డినేటర్ పదవి నీకు ఇచ్చారు, అప్పుడు నువ్వు ఎంత ప్యాకేజీ ఇచ్చావు అని, ఏం అసలు చేయొచ్చు గాని అది హుందాగా ఉండాలని, ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి బొర్ర వాసు, ఒంగోలు నగర కార్యదర్శి మని, కార్యక్రమాల కమిటీ సభ్యులు బొందిల మధు తదితరులు పాల్గొన్నారు.