Logo
Date of Publish : 15 July 2023, 9:39 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి తిరుపతి పర్యటన గురించి మీడియా సమావేశం

        తిరుపతి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోమవారం ఉదయం తిరుపతి ఎస్పీ గారిని కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పోలీసులు పార్టీ నాయకుడు కొట్టే సాయి గారిపై వ్యవహరించిన తీరును ప్రశ్నించడానికి, వినతి ఇవ్వడానికి రానున్న సందర్భంగా తిరుపతి ప్రెస్స్ క్లబ్ నందు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు మీడియా సమావేశం నిర్వహించి పర్యటనకి సంభందించిన వివరాలు తెలియజేయడం జరిగింది. సోమవారం ఉదయం 9.30 గం. కు పవన్ కళ్యాణ్ గారు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. అనంతరం 10.30 గం. తిరుపతి ఎస్పీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. మీడియా సమావేశం అనంతరం తిరుపతి ఎస్పీ గారిని కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన మరియు రూట్ మ్యాప్ గురించి అడిషనల్ ఎస్పీ గారితో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ గారు, టౌన్ ప్రెసిడెంట్ రాజా రెడ్డి గారు , శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారు, జిల్లా కార్యదర్శి కొట్టే సాయి గారు, నాయకులు కృష్ణయ్య గారు, బాబ్జీ గారు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com