రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట నియోజకవర్గంలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ గారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి గారికి పవన్ కల్యాణ్ చిత్తశుద్ధి గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే అన్నమయ్య డ్యాం తెగిపోయినప్పుడు మీ చిత్తశుద్ధి ఎక్కడికి వెళ్లింది జిల్లా కేంద్రం రానివ్వకుండా అడ్డుపడినప్పుడు మీ చిత్తశుద్ధి ఎక్కడికి వెళ్లింది మెడికల్ కాలేజీని రాజంపేటలో లేకుండా మదనపల్లికి తరలించినప్పుడు మీ చిత్తశుద్ధి ఎక్కడికి వెళ్ళింది అని మేడమల్లికార్జున్ రెడ్డి గారిపై జనసేన పార్టీ రాజంపేట ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ గారు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, లీగల్ సెల్లు ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, జనసేన నాయకులు భాస్కర పంతులు, ఆకుల నరసయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, హేమంత్, రామ శ్రీనివాస్, జనసేన వీర మహిళలు జండా శిరీష, మాధవి, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com