పూతలపట్టు ( జనస్వరం ) : పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలంలో అంతర్జాతీయ కార్మికులు దినోత్సవం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు పాల్గొన్నారు. రమాదేవి మాట్లాడుతూ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం. కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ “మే” డే పుట్టుకకు పునాది వేసిందని అన్నారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారని ఈ సందర్భంగా గుర్తు చేసారు. శ్రమ శక్తిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి భాధ్యతని, చమట చుక్కలు చిందించి శ్రామిక లోకం చేసే కష్టం ఆర్ధిక పురోగతికి ఇంధనం లాంటిది, వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటలను ఆదర్శంగా తీసుకుని శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఖాకీ యూనిఫాం మరియు ORSL డ్రింక్స్ పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో రమాదేవి గారు మరియు జనసైనికులు పాల్గొన్నారు.