అరకు ( జనస్వరం ) : మాదాల శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బహుమతులు మొదట ఇంటి పన్ను చెల్లించండి అన్నారు. తరువాత పెట్రోల్, డీజిల్, నూనె నిత్యావసర సరుకుల రేట్లు పెంచారు. నేడు బస్సు ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం మోపుతున్నారు. సామాన్య ప్రజలకు రాష్టంలో బతకనివ్వరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్న ప్రజానీకానికి తోడు పన్నుల పేరుతో దోచుకుంటున్న ప్రభుత్వం రోజుకో రేటు, మాటకు రేటు, పూటకో రేటు ప్రభుత్వ తీరుతో ప్రజలు ఆందోళన చెందున్నారు. ఓట్లు వేసిన పాపానికి ప్రజలకు మీరిచ్చే బహుమతి ఇదేనా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు మాట్లాడుకుంటున్నారన్నారు. అయిన ప్రభుత్వ తీరు మారటం లేదు. ప్రభుత్వ ఆలోచన తీరు మరకపోతే YSR పార్టీ భూస్థాపితం అవ్వడంఖాయమన్నారు. విద్యుత్ చార్జీలు పెంచిన బస్సు ఛార్జీలు వెంటనే తగ్గించాలని లేని పక్షాన జనసేనపార్టీ అద్వర్యంలో ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ప్రభుత్వ తీరు మారేవరకూ పెంచిన చార్జీలు తగ్గించేవరకు జనసేనపార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తామని మాదాల శ్రీరాములు తెలిపారు.