ఎమ్మిగనూరు ( జనస్వరం ) : కేంద్ర ప్రభుత్వం పేదలకోసం ప్రతిష్టాత్మకంగ ప్రవేశపెట్టిన ఉజ్వల్ స్కీమ్ ఏజెన్సీ వారికి వరంగాను పేదలకు శాపంగాను మారిందని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా ఇంఛార్జి గానిగ బాషా తెలిపారు. గొనేగండ్ల మండల కేంద్రంలో ఉన్నా శ్రీ దుర్గా భవానీ గ్యాస్ ఏజెన్సీ నందు అర్హులైన పేదలకు పంపిణీ చేసే ఉజ్వల్ స్కీమ్ ద్వారా వంట గ్యాస్ అందాలంటే డాక్యుమెంట్ ఛార్జీలు రూ 200/- అప్లికేషన్ ఫారం నమోదు కోసం అదనంగా రూ 50/- ఇచ్చిన వారి పేరును మాత్రమే నమోదు చేస్తారని లేదంటే అర్హత ఉన్నా వారికి కనెక్షన్ కట్ తప్పదన్నారు. గ్యాస్ కనెక్షన్ అందాలంటే ఏజెన్సీకి చెయ్యి ఎంత ఎక్కువ తడిపితే అంత త్వరగా గ్యాస్ అందుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. రూ 500/- కంటే ఎక్కువగానే అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉజ్వల్ పథకాన్ని తూట్లు పొడుస్తూ అర్హులైన లబ్ధదారుల నుండి నిలువు దోపిడి చేస్తున్న గ్యాస్ ఏజెన్సీపై విచారణ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com