Logo
Date of Publish : 24 July 2026, 1:26 am
Editor : Sake Naresh

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నెల్లూరులో భారీ నిరసన ర్యాలీ

నెల్లూరు, జూలై 23 (జనస్వరం): నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు రాజా ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆల్ ఇండియా కోటా సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీ సీట్ల వరకే నీట్ పరీక్షను పరిమితం చేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సీట్లలో 25 శాతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న పేద విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో పర్సంటైల్ విధానాన్ని రద్దు చేసి, పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వ హయాంలో 156 సార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని విమర్శించారు. దేశంలోని యువత తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలో ఉందని, బీజేపీ ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తోందని అన్నారు. ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ యూనివర్సిటీ సీట్ల వరకే నీట్ పరీక్షను పరిమితం చేయాలని, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రవేశాలను ఆయా రాష్ట్రాల పరిధిలోనే నిర్వహిస్తేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్లలో 25 శాతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు కోచింగ్ సెంటర్ల కోసం చేస్తున్న ఖర్చు దేశ బడ్జెట్‌ను మించిపోయే స్థాయికి చేరుకుందని అన్నారు. విద్య రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, దానిని కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడం వల్ల రాష్ట్రాల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహించకుండా, నిరసన వ్యక్తం చేస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలను అరెస్టు చేయడం దారుణమన్నారు. అధికారం ఉందనే అహంకారంతో పోరాటాలు చేసే వారిని నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై, కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులకు, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు రాజా మాట్లాడుతూ, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడి అమానుషమని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా అందించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కె. సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యశోదర, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్ఫాన్, లీగల్ సెల్ నాయకుడు వి. సుధీర్, మల్లికార్జున, సుధాకర్ రెడ్డి, హాజీ మహమ్మద్, హనీఫ్, పవన్, కిషోర్, సుజాత, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నాయకులు సుశాంత్, ధనుంజయ్, చందు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com