రాజానగరం ( జనస్వరం ) : సీతానగరం మండలం, రాపాక గ్రామంలో టిడిపి, వైసిపి, ఇతర వర్గాలకు చెందిన సుమారు 100 మంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు, సమాజం కోసం ఆయన పడుతున్న తపన అలానే ఇటీవల రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన బత్తుల బలరామకృష్ణ సమర్థవంతమైన నాయకత్వం, ప్రజల కోసం నిలబడుతున్న తీరు, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి, ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు, వారందరికీ బత్తుల వెంకటలక్ష్మి జనసేన కండువా వేసి మర్యాద పూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అనంతరం శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయం, మాపై నమ్మకంతో జనసేన పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, ఇకనుండి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి పార్టీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని, జనసేన కుటుంబంలో జాయిన్ అయ్యిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీలో చేరిన వారిలో మద్దుకూరి అనంతలక్ష్మి, దుప్పాడ చిన్న లక్ష్మి, పగడాల వెంకటలక్ష్మి, చిటికెన అనంతలక్ష్మి, గంగుల పోచమ్మ, చల్లా కుమారి, చల్లా అరుణ, చల్లా మంగ, చల్లా సత్యవతి, చల్లా పోషికుమారి, చల్లా పద్మ, మేడవట్ల పోసిరత్నం, కొరిమసల నాగు, మేడాబత్తుల దుర్గ దేవి, తాటికొండ రత్నం, తానింకి యేసు రత్నం, యవ్వన భద్రం, బి.పాప, సింహాద్రి రామకృష్ణ, తమ్మిరెడ్డి వెంకటరమణ, మేడాబత్తుల లోవరాజు, గవ్వల నాగేశ్వర రావు, చుండ్రు కోటయ్య, చల్లా మధు, మేడాబత్తుల సూరిబాబు, పేపకాయల రామకృష్ణ, తానింకి పోసి, కోమల శంకరం, సిక్కం వీర్రాజులు, జల్దు శేషు బాబు, తోట శ్రీను, అంబటి జంగారావు, ఇతరు నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.