Logo
Date of Publish : 28 February 2022, 7:06 am
Editor : Sake Naresh

నెల్లూరు జిల్లా జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

    నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు రూరల్ స్థానిక వెంగళ్ రావు నగర్ 33వ డివిజన్ నుంచి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి ఆధ్వర్యంలో రాజు, శంకర్ ఆధ్వర్యంలో దాదాపు 100మంది యువకులు జనసేన పార్టీలోకి కుటుంబ సమేతంగా చేరడం జరిగింది. వారందరికి మనుక్రాంత్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంత మంది యువకులు జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై యువకులు ఈ రోజు జనసేన పార్టీలో చేరడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. అలాగే రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. పార్టీలోకి చేరిన వారికి జనసేనపార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్, గునుకుల కిషోర్, సుధీర్, ప్రశాంత్ గౌడ్, షాకీర్, బాలాజీ, హేమచంద్ర తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com