Logo
Date of Publish : 23 March 2023, 5:17 pm
Editor : Sake Naresh

ఆచంట నియోజకవర్గంలో వైసీపీ నుండి జనసేనపార్టీలోకి భారీ చేరికలు

          జనసేనలో భారీ చేరికలు ఆచంట( జనస్వరం ) : పెనుగొండ మండలం, రామన్నపాలెం గ్రామంలో వైసీపీ పార్టీ నుండి జనసేనలోకి భారీ చేరికలు జరిగాయి. వైసీపీ పార్టీ నుండి MPTC అభ్యర్థిగా పోటీ చేసిన గండ్రోతు వెంకట శ్రీనివాస్ మరియు అతని సన్నిహితులకు ఆచంట నియోజకవర్గ ఇంచార్జి చేగొండి సూర్య ప్రకాష్  మరియు తాడేపల్లిగూడెం ఇంచార్జి బొలిశెట్టి శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేనపార్టీ నుండి గెలుపొందిన Mptc మొఖమాట్ల కృష్ణకాంత్ అతని ప్రత్యర్థిని సాదరంగా పార్టీలోకి స్వాగతించడం మంచి పరిణామం అని అన్నారు. రామన్నపాలెం గ్రామంలో జరిగిన ఈ పరిణామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని పార్టీ పబలోపేతానికి కృషి చేయాలని సూచించారు. చేగొండి సూర్య ప్రకాష్ గారు మాట్లాడుతూ పార్టీ పడవులు పొందిన వారు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, అలాగే పార్టీ కోసం కష్టించి పని చేసిన ప్రతిఒక్కరికి సముచితస్థానం కల్పిస్తానని ఆచంట నియోజకవర్గ ఇంచార్జ్ గా మాటిస్తున్నా అని అన్నారు. ఈ బహిరంగ సభలో పెనుగొండ మండల అధ్యక్షుడు కొండవీటి శ్రీనివాసరావు, పోడూరు మండల అధ్యక్షుడు గుడాల రాజేష్, రామన్న పాలెం గ్రామ జనసేన అధ్యక్షుడు గంట్రోతు సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు, వివిధ గ్రామధ్యక్షులు అధిక సంఖ్యలో పెనుగొండ మండల జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com