చంద్రగిరి, (జనస్వరం) : జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం, పేరూరు గ్రామ పంచాయితీకి చెందిన మురళి ఆహ్వానం మేరకు వారి జన్మదిన వేడుకలలో పాల్గొనడం జరిగింది. మండల బీ.సి నాయకులు మురళి PRP పార్టీ నుండి ప్రజలకోసం తన గళాన్ని వినిపిస్తూ, ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయంతో, జనసేన సభ్యత్వం నమోదు చేసుకొని పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి, జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ స్పూర్తితో, చంద్రగిరి నాయకులు దేవర మనోహర పోరాటపటిమ నచ్చి పేరూరుజనసేనపార్టీలో పంచాయతీలోని దాదాపు 30 కుటుంబాల ప్రతినిధులు, దళిత నాయకులు విజయ్ ఆయన అనుచరవర్గం స్వఛ్చందంగా, మురళి తరపున దేవర మనోహర సమక్షంలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి పాల్గొన్నారు. అదే విధంగా వీరమహిళ ఆశా, వాకా మురళి, యువరాజ్, శేఖర్, కుమార్, కిషోర్, స్థానిక జనసైనికులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com