Logo
Date of Publish : 11 September 2021, 4:32 pm
Editor : Sake Naresh

నర్సీపట్నం నియోజకవర్గములో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

     నర్సీపట్నం, (జనస్వరం) :  నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం సి.హెచ్ నాగ పురం గ్రామంలో వైసిపి, టిడిపి పార్టీల నుండి దాదాపుగా 100 మంది కార్యకర్తలు నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ రాజనా వీర సూర్యచంద్ర గారి సమక్షంలో సి.హెచ్ నాగపురం వైసీపీ నాయకుడు శివ గారితో సహా పలువురు  జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా  శివ గారు మాట్లాడుతూ నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి వైసిపి పార్టీని భవిష్యత్తుపై ఆలోచన లేకుండా విచ్చలవిడిగా ప్రజా ధనం దుర్వినియోగంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, మాకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలని ఉపాధి కల్పన తో కూడిన సమాజ శ్రేయస్సు కోసం జనసేన పార్టీలో సిద్ధాంతాలు నచ్చి  చేరడం  జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజనా వీర సూర్యచంద్ర గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతలు నచ్చి జనసేన పార్టీలోకి చేరడం మంచి శుభపరిణామము అని అన్నారు.  వైసిపి ప్రభుత్వముపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఆశయాలు, సిద్దాంతలును ప్రజల్లోకి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. అలాగే రాబోయే ఎన్నికలలో నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగిరే విధంగా గ్రామాలలో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు జనసేన అభిమానులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com