ముమ్మిడివరం, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం, తాళ్లరేవు మండలం, జార్జిపేట పంచాయితీ, ఎమ్ ఎల్ కె నగర్ లో రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి 100 మందికి పైగా ఎమ్మార్పీఎస్ యువకులు మరియు ఆటోరిక్షా కార్మికులు మహిళలు అధిక సంఖ్యలో చేరారు. వీరందరూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవటం జరిగింది. వీరందరికీ పితాని బాలకృష్ణ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాలుగు మండలాల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com