Logo
Date of Publish : 22 October 2022, 2:59 pm
Editor : Sake Naresh

రాజానగరం నియోజకవర్గంలో జనసేనలో భారీ చేరికలు…

      రాజానగరం ( జనస్వరం ) : రాజానగరం నియోజకవర్గ రాజాకీయాల్లో పెను మార్పు తీసుకొచ్చి జనసేన పార్టీని అంచెలంచెలుగా విస్తరింపజేస్తూ.. ప్రజాక్షేత్రంలో ప్రజలకోసం బలంగా పోరాడుతున్న బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి లను ఎందరో ఆదర్శంగా‌ తీసుకుని జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. జనసేన పార్టీ విధివిధానాలు, బత్తుల దంపతులు ప్రజలకు చేసే మేలుకు ఆకర్షితులై శుక్రవారం రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో వైసీపీ, టీడీపీ పార్టీల నుంచి సుమారు 60 మంది జనసేన నాయకురాలు, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కో ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో గోకాడ సూర్యవతి, బైలపూడి శ్రీను, పొదులాపు రవీంద్ర ల సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. బత్తుల వెంకటలక్ష్మి నూతన నాయకులకు, కార్యకర్తలకు జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ నూతనంగా పార్టీలో చేరిన వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, అందరూ పార్టీ బలోపేతానికి కృషి చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్య మంత్రిని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంతో సీతానగరం మండలంలోని మారుతున్న రాజకీయ సమీకరణాలకు మరింత బలం చేకూరింది. అడుగడుగునా జనసేనకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ బత్తుల బలరామకృష్ణ దంపతుల నాయకత్వంలో రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి ఎన్నడూ లేని విధంగా ఉండబోతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు మట్ట వెంకటేశ్వరరావు, మాధవరావు వీరభద్రరావు, రొంగలి అభిరామ్ నాయుడు, కవల సురేష్, బైలపూడి శ్రీను, గోకాడ సూర్యవతి, రవి, సందీప్, నాగేంద్ర, అడపా నరసింహ, ప్రగడ శ్రీహరి, ముత్యాల మహేష్, నారాయడు, కిలాడి యర్రయ్య, ప్రసాద్, బ్రహ్మం, వివేక్, సీరంగం మణి తదితరులతోపాటు జనసేన శ్రేణులు, జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com